Today (19-01-23) Stock Market Roundup: ప్రపంచం బాధ.. ఇండియా మీద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (19-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండు రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు కూడా సాయంత్రం నష్టాలతోనే ముగిశాయి. మార్నింగ్ సెషన్‌లో వచ్చి భారీ నష్టాలను మాత్రం ఇంట్రాడేలో కొంత వరకు పూడ్చుకోగలిగాయి.
read more: Gold Imports: డిసెంబర్‌లో 79 శాతం తగ్గిన బంగారం దిగుమతి
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
కానీ.. అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో నెలకొన్న ముందుజాగ్రత్తల ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ప్రతికూలంగా పడింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్‌లు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ చివరికి 187 పాయింట్లు కోల్పోయి 60 వేల 858 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 57 పాయింట్లు తగ్గి 18 వేల 107 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌లో 10 స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. ఏసియన్ పెయింట్స్ షేర్ల విలువ తీవ్రంగా దెబ్బతింది. ఈ కంపెనీ తాజా త్రైమాసిక ఫలితాలు ముందస్తు అంచనాలకు తగ్గట్లు లేకపోవటంతో స్టాక్స్ వ్యాల్యూ 3 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీలో కోలిండియా, యూపీఎల్ బాగా రాణించాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. ఓఎన్‌జీసీ స్టాక్స్ 2 శాతం ప్రాఫిట్స్ పొందాయి.
తద్వారా 6 నెలల గరిష్ట విలువకు చేరుకున్నాయి. సంస్థ లాభాల్లో భారీ వృద్ధి నెలకొంటుందనే పాజిటివ్ సెంటిమెంట్ కలిసొచ్చింది. రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు సైతం లాభాల్లో కోతలకు గురయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ సున్నా పాయింట్ 6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ సూచీదీ ఇదే పరిస్థితి. 10 గ్రాముల బంగారం ధర 92 రూపాయలు పెరిగి అత్యధికంగా 56 వేల 378 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 266 రూపాయలు నష్టపోయి గరిష్టంగా 67 వేల 961 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్ ధర 107 రూపాయలు తగ్గి ఒక బ్యారెల్ చమురు 6 వేల 403 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 36 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!