Today (09-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమై అదే స్థాయిలో ముగిసింది. రెండు సూచీలు కూడా తమ బెంచ్ మార్క్‌లకు ఎగువన క్లోజ్ కావటం చెప్పుకోదగ్గ అంశం. ఈ రోజు ఫస్టాఫ్ ట్రేడింగ్‌లో గరిష్ట స్థాయిలో వచ్చిన లాభాలను సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పెద్దఎత్తున స్టాక్స్ అమ్మకాలకు దిగటంతో సెకండాఫ్‌లో మార్కెట్ ఊగిసలాటకు గురైంది.
ఒకానొక దశలో 60 వేల 889 పాయింట్లకు చేరిన సెన్సెక్స్.. ఈ సేల్స్ వల్ల 60 వేల 700 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ కూడా 18 వేల 50 పాయింట్ల వద్ద టెస్టింగ్‌కి గురైంది. చివరికి సెన్సెక్స్ 846 పాయింట్లు లాభపడి 60 వేల 747 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 241 పాయింట్లు ప్లస్సయి 18 వేల 101 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో మూడు సంస్థలు మినహా మిగతా 27 కంపెనీలూ నష్టాల బాటలోనే నడిచాయి.
read more: Steve Jobs @ Apple: ‘యాపిల్’ ఉన్నంత కాలం.. యాదికొస్తూనే ఉంటాడు..
హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎయిర్‌టెల్ షేర్ల విలువ 2 నుంచి 4 శాతం మధ్యలో పెరిగాయి. సెన్సెక్స్‌లో జైడస్ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రా అండ్ మహింద్రా స్టాక్స్ భారీగా దెబ్బతిన్నాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 3 శాతం పెరిగింది. లాభాలు పొందిన సంస్థల్లో హెచ్‌సీఎల్ టెక్ మరియు టీసీఎస్ టాప్‌లో నిలిచాయి. రంగాల వారీగా చూస్తే టెక్స్‌టైల్ కంపెనీల షేర్లు బాగా రాణించాయి. నితిన్ స్పిన్నర్స్, ఫిలాటెక్స్, లంబోధర స్టాక్స్ వ్యాల్యూ 16 శాతం దాకా పెరిగింది.
10 గ్రాముల బంగారం రేటు 322 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 65 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 325 రూపాయలు లాభపడి అత్యధికంగా 69 వేల 480 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 63 పైసలుగా నమోదైంది.