TN Elections 2026: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో!
- నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం
- ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో బిజీ
- తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారం ముగుస్తుంది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండటంతో.. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో ముగింపు పర్వానికి సిద్ధమయ్యారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొలత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగిస్తారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం ముగిస్తారు. హీరో విజయ్ తన నియోజకవర్గం పెరంబూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నైలోని తెలుగు ఓటర్లే లక్ష్యంగా రంగంలోకి దిగారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ టినగర్, ఆవడి పరిసరాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ కూటములు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.
Also Read
- Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
- Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
- AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
- Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
Also Read: Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
సీఎం స్టాలిన్ దాదాపు 120కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని తన ప్రభావాన్ని చాటారు. అటు విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా వెనక్కి తగ్గకుండా 100 ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన ‘ఎన్ మన్ ఎన్ మక్కల్’ యాత్రతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. విజయ్ తన పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక తెలుగు ఓటర్లు కీలకమైన చెన్నై, కృష్ణగిరి, హోసూరు వంటి ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 10-15 కీలక ప్రాంతాల్లో బాబు ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోనుండటంతో.. నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ముగింపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
-
Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!
-
Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!