EVMs: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు.. ఈసీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పలు ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు ఉండడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని బాంకురా జిల్లాలోని కొన్ని ఓటింగ్ యంత్రాలపై బీజేపీ అని రాసి ఇంగ్లీస్ అక్షరాలు రాసి ఉన్నాయి. దీంతో ఈ ఫొటోలు తీవ్ర కలకలం రేపాయి. ఈవీఎంలపై బీజేపీ అని రాసి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తీవ్ర దుమారం చెలరేగడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ ట్యాగ్‌లపై క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Baby Copy Controversy: నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ఈవీఎంలను ట్యాంపర్ చేసి బీజేపీ ఓట్ల రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలుమార్లు చెప్పారని.. ఈ రోజు అది బయటపడిందని టీఎంసీ ఆరోపించింది. బాంకురా జిల్లాలోని రఘునాథ్‌పుర్‌లో 5 ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు కన్పించాయని. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ట్విట్టర్‌లో డిమాండ్ చేసింది. ఈ పోస్ట్‌కు ఫొటోలను జత చేసింది.
ఫొటోలు కాస్త వైరల్‌గా మారడంతో బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్‌లను ఇస్తుంటామని… వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటామని తెలిపింది. టీఎంసీ ఆరోపించిన కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారని.. అందుకే ఆయన సంతకం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించినట్లు తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తామన్నారు. ఈ ప్రక్రియంతా వీడియోగ్రాఫ్ చేస్తామని.. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడున్నాయంటే..?
ఆరో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో తమ్లుక్, కంఠి, ఘటల్, ఝుర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. బంకురాలోని రఘునాథ్‌పూర్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో ఐదు ఈవీఎంలపై బీజేపీ ట్యాగ్‌లు కనిపించడంతో కలకలం రేగింది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.
And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX
— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024
Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.
And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX
— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!