కొత్త పార్లమెంటు బిల్డింగ్ ను మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బాయ్ కాట్ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సంధిస్తూ టీఎంసీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ఈ ప్రకటనను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ నూతన పార్లమెంటు భవనం మొత్తం ‘నా, నాది, నాదే’ అనే ధోరణిలో మోడీ ఉన్నారంటు ఆయన విమర్శించారు.
Also Read : Mamata Banerjee : మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ
పార్లమెంటు అంటే కేవలం ఒక నూతన భవంతి కాదని టీఎంసీ రాజ్యసభ సభ్యులు డెరెక్ ఒబ్రియన్ అన్నారు. ఇది ఒక వ్యవస్థ అని, పాత విలువలు, సాంప్రదాయాలు, ఆనవాయితీలు, నిబంధనలకు సంబంధించినదని ఆయన వివరించారు. భారత దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని తెలిపారు. కానీ, ప్రధాని మోడీకి ఇవి అర్థం కావు అని విమర్శించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపలేదని ఆయన పేర్కొన్నారు.
Also Read : Off The Record: అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కిందా?
పార్లమెంటు భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కూడా ఆహ్వానించలేదని మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్నదని, రాష్ట్రపతి కార్యాలయానికి కేవలం స్టాంప్‌నకు ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదని, ఇప్పుడు అదే నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించక పోవడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Parliament is not just a new building; it is an establishment with old traditions, values, precedents and rules – it is the foundation of Indian democracy. PM Modi doesn’t get that
For him, Sunday’s inauguration of the new building is all about I, ME, MYSELF. So count us out
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) May 23, 2023