Site icon NTV Telugu

Tirumala: భక్తులకు గుడ్న్యూస్.. నేటి నుంచే ఆన్లైన్లో తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల రిజిస్ట్రేషన్

Tpt

Tpt

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎల‌క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. కుటుంబ స‌భ్యులు అంద‌రికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ పేర్కొనింది.

Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన

అయితే, ఇవాళ్టి (నవంబర్ 27) నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎల‌క్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పించింది టీటీడీ. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ లో ఎల‌క్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇక, డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాలను భక్తులకు అందించబడతాయి.

Read Also: Girija Oak: పాపులారిటీతో పాటు వేధింపులు కూడా స్టార్ట్.. “వస్తావా? గంటకు రేటెంత?” అని అడుగుతున్నారు!

ఇక, వాట్సాప్ ద్వారా ఎల‌క్ట్రానిక్‌ డిప్ రిజిస్ట్రేష‌న్ న‌మోదు చేసుకునే భ‌క్తులు ఏపీ గవర్నమెంట్ స‌ర్వీసెస్ నెంబర్ కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్‌, తెలుగు భాష‌ల‌ను సెల‌క్ట్ చేసుకుని.. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీరు ఎంచుకున్న భాష‌లో స‌ర్వీసెస్ విండో ఓపెన్ అవుతుంది.. ఆ స‌ర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ స‌ర్వీసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. టీటీడీ టెంపుల్ స‌ర్వీసెస్‌ తెరిచిన తర్వాత వైకుంఠ ద్వార ద‌ర్శనం (డిప్‌) రిజిస్ట్రేష‌న్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్‌, తెలుగు, త‌మిళ్‌, హిందీ, కన్నడ భాష‌లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని కన్ఫమ్ చేయాలి.. ఆ తర్వాత చిరునామా, పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Read Also: TG Local Body Elections: నామినేషన్ వేస్తున్నారా..? ఈ పది పాయింట్స్ తప్పనిసరి.. లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్..!

కాగా, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వ‌య‌స్సు, లింగం, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.. ఆ త‌ర్వాత మరోసారి వివ‌రాల‌ను స‌రి చూసుకుని సబ్మిట్ చేసేయాలి. అయితే, ఒక్కసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి అవకాశం ఉండదనే విషయాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకోండి.. కానీ, ఆధార్ కార్డు, పిన్ నంబర్లను తప్పుగా ఎంటర్ చేస్తే మార్చుకునే అవకాశం కల్పించారు. భక్తులు సబ్మిట్ చేసిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ వ‌స్తుంది. ఆ మెసేజును రిఫరెన్స్ నంబరుగా దగ్గర పెట్టుకోవాలి. అలాగే, శ్రీవారి భక్తులు ఇక్కడ మరో విషయాన్ని మార్చిపోవద్దు.. ఒక మొబైల్ నెంబ‌ర్, ఒక ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే ఛాన్స్ ఉంటుందని టీటీడీ తెలియజేసింది.

Exit mobile version