Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tiger Tensions In East Godavari District

Tiger Tension: టెన్షన్‌ పెడుతోన్న పులి.. ఆనవాళ్లు చూసి వణికిపోతున్నారు..

Published Date :February 1, 2024 , 11:26 am
By Sudhakar Ravula
Tiger Tension: టెన్షన్‌ పెడుతోన్న పులి.. ఆనవాళ్లు చూసి వణికిపోతున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tiger Tension: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను పెద్దపులి గత కొంతకాలంగా వణికిస్తోంది. కొద్ది రోజులుగా పలు మండలాల్లో పెద్దపులి సంచరిస్తుంది సమీప గ్రామాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా, నల్లజర్ల మండలం పోతవరంలో కూడా పెద్దపులి సంచరించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పొలంలో పులిపాద ముద్రలతో పాటు, ఫెన్సింగ్ దాటిన సమయంలో తీగలకు చిక్కిన పెద్దపులి జుట్టును గుర్తించారు స్థానిక రైతులు. దీంతో, ఎప్పుడు..? ఎక్కడి నుంచి? ఎలా? ఆ పులి దాడి చేస్తుందోనంటూ భయాందోళనకు గురవుతున్నారు.. ఇక, ఈ సమాచారాన్ని ఫారెస్ట్‌ అధికారులకు అందించారు స్థానికులు. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గత వారం రోజుల క్రితం బయటికి వచ్చిన పెద్దపులి దెందులూరు వరకు సంచరించింది. ఆ తర్వాత పుల తిరుగు ప్రయాణంలో ఉన్నట్టుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు చోట్ల పశువులపై దాడి చేసి తినేసింది పెద్దపులి. దాని కదలికలను ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. పులి సంచారం తెలుసుకోవడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు.. పులికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తమకు వెంటనే చేరవేయాలని.. భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని ధైర్యం చెబుతున్నారు. అయితే, పంట పొలాల్లోకి వెళ్లే రైతులు.. పశువులను, గొర్రెలను పొలానికి తీసుకెళ్లేవారు.. పొలం పనులకు వెళ్లే కూలీలు, స్థానిక గ్రామాల ప్రజలు అంతా పులి భయంతో ఆందోళనకు గురిఅవుతున్నారు.

Read Also: Budget 2024 : బడ్జెట్ రోజున ఆకట్టుకున్న నిర్మల సీతారామన్ చీర

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • East Godavari District
  • tiger
  • Tiger Tension

తాజావార్తలు

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

  • Indian Growth: భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుతం ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions