సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవం సోమవారం ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు యూనివర్సిటీ స్నాతకోత్సవం ప్రారంభం అయింది. భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిఽథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందించారు.