NTV Telugu Site icon

Tiger : బద్లాపూర్ తాండ అటవీ ప్రాంతంలో పులి సంచారం

Tiger In Asifabad

Tiger In Asifabad

తెలంగాణలో అటవీ ప్రాంతాల్లోని ప్రజలను పులుల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని బద్లాపూర్ తాండ అటవీ ప్రాంతంలో పులి సంచారిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ పొలంలోని కుక్కపై పులి దాడి చేసి తిన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించారు. పులి పాదముద్రలు గుర్తించేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మైల్వర్ తండాలో సంచరించిన పులి.. పక్కనే కర్ణాటక రాష్ట్రం అటవీ ప్రాంతం కలుపుకొని ఉండడంతో తరచూ పులులు సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read : Jyothula Chanti Babu: ఎన్టీఆర్‌ని మింగేసిన అనకొండ చంద్రబాబు.. నమ్మి మోసపోయిన వాళ్లలో నేను ఒకడిని..

అయితే.. పులి సంచారం గురించి తెలియడతో ఆ తండాతో పాటు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ శాఖ అధికారులు సూచించారు. అయితే.. వేరుశనగ పంట పండి చేతికొచ్చే దశలో ఉందని పొలాలకు కాపలాగా వెళ్లకుంటే అడవి పందులు పంటను నాశనం చేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. గత మూడు రోజు క్రితం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో పులి . సోమవారం సిర్పూర్ మండలం వెంపల్లి బొందలబ్రిడ్జి సమీపంలో వాహనదారులకు పులి కనిపించిందని ప్రయాణికులు తెలిపారు. కారులో వెళ్తున్న వ్యక్తులు పులిని సెల్ ఫోన్ లో బంధించినట్లు తెలిపారు. పులి సంచారంతో సిర్పూర్ ప్రాంతంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Also Read : Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్