రోజువారిలాగే వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ రైతుపై పులి దాడి చేసిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి శెలితే.. వాంకిడి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము అనే రైతు రోజులాగే పత్తి పొలం వద్దకు కాపాలా కోసం వెళ్లాడు. అయితే.. అదే సమయంలో పెద్దపులి అతడిపై దాడి చేసింది. దీంతో సిడాం భీము అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత దూరం సిడాం భీమును ఈడ్చుకెళ్ళి తీవ్రంగా గాయపర్చి చంపినట్లు ఆనవాలు కనిపించాయి. భీము మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. అయితే..
ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పులుల సంచారం పెరిగింది. మొన్న 4 పులుల భీంపూర్ మండలం గోళ్లగడ్ తాంసీ సమీపంలో సంచరిస్తూ.. స్థానికులను కునుకులేకుండా చేశాయి. అయితే.. డీజిల్ కోసం వెళ్లిన డ్రైవర్ కు రాత్రి సమయంలో పిప్పల్ కోటి రిజర్వాయర్ దగ్గర 4 పులులు కనిపించాయి.
Also Read : YS Jagan: రేపు హైదరాబాద్‌కు వైఎస్ జగన్.. సూపర్‌స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం..
అంతేకాకుండా.. ఇప్పటికే కొరాట, గూడా, రాంపూర్, తాంసి, గొల్లఘాట్ ప్రాంతాల్లోని రైతులు పంట పొలాలకు పులుల భయంతో ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు. ఇదే సమయంలో.. నిన్న భీంపూర్ మండలంలో గుంజాల సమీపంలో ఆవుపై దాడి చేసి చంపాయి. వారం క్రితం చెనాక కొరటా పంప్ హౌస్ సమీపంలో 2 పులులు కనిపించగా.. ఇవాళ వాంకిడి మండలం ఖానాపూర్ లో పులి రైతుపై దాడి చేసి చంపడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులులను పట్టుకోవాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. అయితే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా.. పులిలను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.