Terrorists arrest: భారత సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists arrest: భారత్ సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి వేళ భారీగా వర్షం పడుతున్న సమయాన్ని వారు చొరబాటుకు ఎంచుకున్నారు. ఇది గమనించిన భారత సైన్యం జమ్ముకశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు సైతం ఎదురుకాల్పులు జరిపారు.
Read Also: Vehicles Registration in TS: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కాల్పులు ఆగిపోయిన అనంతరం భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ముగ్గురు ఉగ్రవాదులు గాయాలతో పడి ఉన్నారు. గాయాలతో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక మందుపాతరలకు ఉపయోగించే దాదాపు 10 కేజీల మందుగుండు సామాగ్రిని కూడా సీజ్ చేశారు. ఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత జవాన్‌కు ఒకరికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..