LOC : పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా పాకిస్తాన్ పోస్టులపై కాల్పులు జరిపి తగిన సమాధానం ఇచ్చింది.
భారత్ సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు.