Tirumala: తిరుమలలో హెలికాప్టర్ల చక్కర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు కూడా ఎయిర్ఫోర్స్ విభాగానికి చెందినవిగా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందినవిగా గుర్తించారు అధికారులు.. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో ఆ మూడు హెలికాప్టర్లు తిరుమల మీదుగా ప్రయాణించినట్లు తెలుస్తోంది.
Read Also: Tollywood: ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే!
Also Read
కాగా, తిరుమల శ్రీవారి ఆలయంపై గతంలో విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించిన విషయం విదితమే.. విమానం ఆలయం మీదుగా వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందని ఆరా తీసేందుకు.. చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ విమానం సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిందిగా గుర్తించారు. భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికే విమానం వచ్చిందని.. సంబంధిత సిబ్బంది చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్న విషయం విదితమే.. అయితే, శ్రీవారి ఆలయం పరిసరాల్లో విమానాలు తిరగడకూడదనే నిబంధన ఉండి కూడా.. ఇలా విమానాలు.. ఇప్పుడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!