Bihar: చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి.. బంకాలో విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది. గ్రామానికి చెందిన 7 ఏళ్ల కుమార్తె డోలి కుమారి, 8 ఏళ్ల కిరణ్ కుమారి, 9 ఏళ్ల బేబి కుమారి ముగ్గురూ చెరువులో స్నానానికి వెళ్లారు.
Read Also: Suriya: అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది..
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
చెరువు ఒడ్డున బాలికల బట్టలు కనపడటంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి.. గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ముగ్గురు బాలికలను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. అనంతరం ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Hafiz Saeed: ముంబై దాడుల ఉగ్రవాది కుమారుడు మిస్సింగ్.. గజగజ వణుకుతున్న పాకిస్తాన్..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బంకా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బరాహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు ముగ్గురు బాలికలు చెరువులో మునిగి చనిపోయారన్నారు. మృతదేహాలను అదుపులోకి తీసుకున్నామని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు యూడీ కేసు నమోదు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!