Hafiz Saeed: దాయాది దేశం పాకిస్తాన్ లో ఏదో జరుగుతోంది వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. రెండుమూడు రోజుల క్రితం జియావుర్ రెహ్మన్ అనే హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాదిన కరాచీలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి ఆయన్ని హతమార్చారు. కాశ్మీర్ లో హిజ్బుల్ తరుపున ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే పనిని ఈ ఉగ్రవాది చేసేవాడు.
Read Also: US Visa: రికార్డ్ బద్ధలు..ఈ ఏడాది 10 లక్షల భారతీయులకు అమెరికా వీసాలు..
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ మరో సంఘటన జరిగింది. 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చీఫ్ హఫీస్ సయీద్ కుమారుడు కనిపించడం లేదు.పెషావర్ లో కమాలుద్దీన్ సయీద్ మిస్సయ్యాడు. ఈ నెల 26 నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఈ ఉదంతంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రభుత్వం, గూఢాచార సంస్థ ఐఎస్ఐలో కంగారు మొదలైంది. ఐఎస్ఐ కమాలుద్దీన్ గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటి వరకు అతని ఆచూకీ ట్రేస్ చేయలేకపోయారు. కారులో వచ్చినవారు అతడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
హఫీస్ సయీద్ ముంబై ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ గా ఉన్నాడు. లష్కరేతోయిబా ఉగ్ర సంస్థ చీఫ్. ఐక్యరాజ్యసమితి, భారతదేశం, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, రష్యా చేత ఇతను ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు. అయితే తాజా కిడ్నాప్ భారత ఏజెంట్లే చేశారని పాక్ మీడియా కోడై కూస్తోంది. రా ఏజెంట్లే కిడ్నాప్ చేశారనే ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు పాకిస్తాన్ లో తీవ్ర చర్చనీయాంశం అయింది.