Summer Season: దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న ఎండలు.. సాధారణం కన్నా అధికం.. ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India To Witness Above-Normal Temperatures From April To June: మార్చి చివర నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎండాకాలంపై కీలక సమాచారాన్ని తెలిపింది. ఈ సారి ఎండాకాలం మండేకాలంగా ఉండబోతోందని వెల్లడించింది. భారత్ చాలా ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉండనున్నట్లు తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాననున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ కాలంలో తూర్పు, వాయువ్య భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువగా వడగాలుల ప్రభావం ఉండబోతోందని అంచానా వేసింది.
Read Also: CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు
Also Read
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వడగాలల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో, వాయువ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కన్నా తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక మిగతా దేశంలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఈశాన్య, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతంలోని వివిక్త ప్రాంతాలను మినహాయించి దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో తెలిపింది. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని, తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!