NTV Telugu Site icon

Delhi Assembly Elections : ఐదు రోజుల్లో ఓటింగ్‌.. ఆప్‌కి భారీ ఎదురు దెబ్బ..

Aap

Aap

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావనా ​​గౌడ్ (పాలెం). బీఎస్ జూన్ (బిజ్వాసన్) ఉన్నారు.

READ MORE: Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!

జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్‌కు రాజీనామా లేఖ పంపారు. లేఖలో పార్టీ ప్రాథమిక సూత్రాలను విడనాడి అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. సంతోష్ కోలీ త్యాగానికి అవమానం జరిగిందని రాశారు. సంతోష్ కోలీని చంపిన హంతకుడికి టికెట్ ఇవ్వడం పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడమేనన్నారు. పార్టీలో ఆశ్రిత పక్షపాతం కూడా ఉందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నియంత్రణ లేని ముఠాగా అభివర్ణిచారు. పార్టీ నాయకత్వం అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వానికి పర్యాయపదంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన

పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. నరేష్ యాదవ్‌కు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత దానిని ఉపసంహరించుకుంది. ఖురాన్‌ను అవమానించిన కేసులో యాదవ్‌కు పంజాబ్ కోర్టు శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన హైకోర్టులో స్టే తీసుకున్నారు. నరేష్ యాదవ్‌కు టికెట్ ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎం లేవనెత్తాయి.దీంతో టికెట్ నిరాకరించింది.