గుంటూరు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుల పుణ్యమే ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవితమన్నారు. మన దేశానికి 76 సంవత్సరాలు క్రితం స్వాతంత్రం వచ్చిన నేటికీ మౌలిక సదుపాయాలు ప్రజలకు అందడం లేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు కష్టాలు మాత్రం తీరడం లేదన్నారు తోట చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు.
Also Read : Priya Vadllamani: అక్కడ ఆ మచ్చ అదిరింది ప్రియా.. కిర్రాక్ పో
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఒకటి కూడా అమలు చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని, బీజేపీని నిలదీసే దమ్మున్న పార్టీ ఈ రాష్ట్రంలో ఒకటి కూడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేక అంశాలలో వెనకబడి ఉందన్నారు. ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారో సీఎం బహిరంగంగా చెప్పాలన్నారు తోట చంద్రశేఖర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణను అడ్డుకునే దగ్గర నుండి ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ను ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామన్నారు.
Also Read : Andrea : ఆ సినిమాలో బట్టల్లేకుండా నటించాను.. సంచలన విషయం చెప్పిన ఆండ్రియా