పారిస్ ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను ఓడించి భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ప్రత్యేక విజయాన్ని సాధించి దేశ గౌరవాన్ని పెంచినందుకు నీరజ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. జావెలిన్ త్రో ఫైనల్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది.
READ MORE:Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్ ఏమైనట్టు..?
ఈ ఈవెంట్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఈ సీజన్‌లో నీరజ్ చోప్రా తన బెస్ట్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలుచుకున్న రెండవ(పురుషుల విభాగంలో). ఓవరాల్‌గా మూడవవాడు. వరుసగా రెండు పతకాలు సాధించిన రెండో భారతీయురాలు పీవీ సింధు. 2016, 2020లో రజత పతకాలు సాధించింది.
READ MORE:Adivasi Divas: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. వేడుకల్లో సీఎం చంద్రబాబు..
ఒలింపిక్స్‌లో భారత జట్టు 14వ రోజు షెడ్యూల్ ఇదే..
గోల్ఫ్- మహిళల వ్యక్తిగత విభాగం: అదితి అశోక్, దీక్షా దాగర్: మధ్యాహ్నం 12.30 నుంచి ప్రారంభం
అథ్లెటిక్స్- మహిళల 4×400 మీటర్ల రిలే మొదటి రౌండ్: మధ్యాహ్నం 2.10గం నుంచి ప్రారంభం
పురుషుల 4×400 మీటర్ల రిలే మొదటి రౌండ్: మధ్యాహ్నం 2.35 గం
రెజ్లింగ్- పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ కాంస్య పతక పోరు: అమన్ సెహ్రావత్ వర్సెస్ డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టో రికో) రాత్రి 9.45 నుంచి.