మనం వంటల్లో ఘాటు, సువాసన కోసం వాడే వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే చాలు. అయితే పచ్చి వెల్లుల్లిని తినటం కష్టమే. అందువల్ల నూనె లేకుండా డ్రై గా కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పురుషులలో వచ్చే అనేక రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు..
వెల్లుల్లి రెబ్బల ను పొట్టు తీసి నూనెలో కాల్చాలి.. పురుషులలో వచ్చే అనేక రకాల సమస్యలు పరిష్కారానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి వేగించిన వెల్లుల్లి ప్రతిరోజు తింటే పురుషుల్లో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వేగించిన వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు రావు.. రక్తాన్ని గడ్డ కట్టడాని కి సహాయ పడుతుంది.. అలాగే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న పురుషుల్లో రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి వెల్లుల్లిలో జింక్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి..
అలసట, నీరసం, నిస్సత్తువ అనిపించినప్పుడు ఇలా వేగించిన వెల్లుల్లిపాయ తింటే ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఉదయం సమయంలో పరగడుపున తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. ఇకపోతే ఈ వేయించిన వెల్లుల్లి తినడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. కాల్చిన వెల్లుల్లి పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో సహాయ పడుతుంది. వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే పరగడుపునే నేరుగా తినవచ్చు.. చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..