TG Assembly Sessions: నేడు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను వివరిస్తూ ప్రసంగిస్తారు.
Read also: TG Assembly Sessions: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. ప్రభుత్వ ఎజెండా రిలీజ్
సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మన్మోహన్‌సింగ్ సేవల గురించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సంతాప తీర్మానం ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. కాగా, సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం పరిశీలించారు. సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు.
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం “దిల్ రూబ” టీజర్ డేట్ ఫిక్స్