Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. మొదటి మూడు సీజన్లలో సినీ, రాజకీయ ప్రముఖములను షోకు పిలిచి బాలయ్య గేమ్స్ ఆడించడం, రహస్యాలను బయటపెట్టించడం బాగా వర్కౌట్ అయింది. బాలయ్యలోని మరో కోణాన్ని బయటపెట్టిన ఈ షోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. తాజా ఎపిసోడ్ లో వెంకటేష్ తన అభిమానులను అలరించారు.
Read Also:Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం “దిల్ రూబ” టీజర్ డేట్ ఫిక్స్
తాజా అప్‌డేట్ ప్రకారం.. గేమ్ ఛేంజర్ టీమ్, ‘ఆహా’లో పాపులర్ సెలబ్రిటీ టాక్ షో అయిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4’కి రాబోతుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ 31, 2024న జరగబోతుంది. మరి ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్‌తో పాటు ఎవరు జాయిన్ అవుతారో చూడాలి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల కానుంది. రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ కి ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది.
Read Also:TG Assembly Sessions: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. ప్రభుత్వ ఎజెండా రిలీజ్