టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.