Jamun Fruit: వర్షాకాలంలో వచ్చే పండ్లలో నేరేడు పండు ఒకటి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నేషియం, విటమిన్ సి, విటమిన్ బి లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే నేరుడుపండు తింటే ఆరోగ్యానికి మంచింది. ఐతే నేరేడుపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంతేకాకుండా కొంత మంది వీటిని అస్సలు తినకూడదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Bhaag saale: టీవీ షోలలో ప్లాస్టిక్ కామెడీ.. ‘భాగ్ సాలే’ నిర్మాత అర్జున్ సంచలన వ్యాఖ్యలు
నేరేడుపండ్లను నీరసంగా ఉన్నప్పుడు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా డయాబెటిక్ రోగులు రోజూ ఈ పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెస్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిది. అంతేకాకుండా నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక వాటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో
సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.
Daggubati Purandeswari: షాక్‌లో ఏపీ బీజేపీ నేతలు.. పురంధేశ్వరికి బాధ్యతల వెనుక అసలు కారణం ఇదేనా..?
అయితే నేరేడు పండు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి.
నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం. అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.