Amazon Prime Free: చాలామంది వినియోగదారులు రీఛార్జ్ ప్లాన్ తో పాటు OTT యాప్ ల సభ్యత్వాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే., OTT యాప్ ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్లు చాలా తక్కువ. ఇకపోతే జియో, ఎయిర్‌టెల్, విఐ లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్ లను తీసుకొచ్చాయి. రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా చూడగలరు. మరి ఈ 3 కంపెనీలు ఏ ప్లాన్స్ ను అందిస్తున్నాయో చూద్దామా..
జియో (JIO) :
మీరు జియో సిమ్‌ని ఉపయోగిస్తుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్న రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మూడు ఎంపికలు ఉన్నాయి.
రూ. 1,029 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీనితో మీరు అందులోని కంటెంట్ ను ఆస్వాదించవచ్చు. అయితే ప్రైమ్ మొబైల్ ఎడిషన్ కోసం మాత్రమే అందుబాటులో ఉందని గుర్తుంచుకోండి. ప్లాన్ లో 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు ఒక్క రోజుకు 2GB డేటా మాత్రమే అందించబడుతుంది.
రూ. 4498 ప్లాన్: మీరు తరచుగా రీఛార్జ్ చేసే అవాంతరాల నుండి పూర్తిగా అందునుచి బయట పొందాలనుకుంటే, అలాగే OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా కావాలనుకుంటే ఈ ప్లాన్ మీకు మరింత మెరుగ్గా ఉంటుంది. దీని వాలిడిటీ 365 రోజులు. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో సహా 15 OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వబడుతుంది.
Road Accident: ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు..?
భారతీ ఎయిర్‌టెల్ (Airtel) :
రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్: 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. వీటితో సహా 20 OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత ప్రాప్యతను పొందుతారు.
రూ. 1,199 ప్లాన్: ఈ ప్లాన్‌లో 2.5 GB డేటా ఇవ్వబడుతుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అనేక ఇతర 20 కంటే ఎక్కువ OTT యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
Virat Kohli Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లోని భారత అథ్లెట్లకు కోహ్లీ శుభాకాంక్షలు.. (వీడియో)
వోడాఫోన్ ఐడియా (Vi):
రూ. 996 ప్లాన్: ఈ ప్లాన్‌తో మీరు 84 రోజులు పాటు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అనేక ఇతర సౌకర్యాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. Vi యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్‌లో, ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల పాటు అందించబడుతుంది. ఇది కాకుండా, ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల మధ్య అపరిమిత రాత్రి డేటా అందించబడుతుంది. వినియోగదారులు వారాంతాల్లో ఉపయోగించని డేటాను ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో, ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించకుండానే ప్రతి నెలా 2 GB బ్యాకప్ డేటా అందుబాటులో ఉంటుంది.