Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News These Persons Did Not Have Pay Late Fees On Filing Income Tax Returns Filed After Deadline

Income Tax Returns Filing: గుడ్‌న్యూస్.. వీళ్లు ఐటీ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేయవచ్చు

Published Date :July 23, 2022 , 5:02 pm
By Ramesh Nalam
Income Tax Returns Filing: గుడ్‌న్యూస్..  వీళ్లు ఐటీ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేయవచ్చు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

income tax returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు జూలై 31తో ముగియనుంది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అయితే ఐటీఆర్ దాఖలు ప్రక్రియలో కొందరికి మాత్రం చట్టం మినహాయింపు ఇచ్చింది. వీరు గడువు దాటిన తర్వాత సమర్పించినా ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయంలో కనీస మినహాయింపు పరిమితి దాటకపోతే తుది గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. సెక్షన్‌ 234ఎఫ్ ప్రకారం వాళ్లకు ఆలస్య రుసుము వర్తించదన్నారు. సెక్షన్‌ 80సి నుంచి 80యూ కింద డిడక్షన్లను తీసుకోకముందు ఉండే మొత్తం ఆదాయాన్ని గ్రాస్‌ ఇన్‌కమ్‌గా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం వయసుతో సంబంధం లేకుండా కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం 60 ఏళ్ల లోపు వారికి కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. 60-80 ఏళ్ల మధ్య వారికి ఇది రూ.3 లక్షలుగా ఉండగా.. 80 ఏళ్లు పైబడిన వారికి కనీస మినహాయింపు పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.

Read Also: TFPC: పుకార్లు నమ్మొద్దంటున్న నిర్మాతల మండలి!

Also Read

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..
  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
Add as a preferred
source on google

మరోవైపు కనీస మినహాయింపు పరిమితిని మించి ఆదాయం లేకున్నా కొందరు వ్యక్తులు కచ్చితంగా ఐటీఆర్‌ సమర్పించాలి. ఏదైనా బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒకటి లేదా అంతకుమించి కరెంటు ఖాతాల్లో ఏక మొత్తంలో లేదా అగ్రిగేట్‌గా రూ.కోటికి మించి జమ చేస్తే ఐటీఆర్‌ సమర్పించాలి. ఏక మొత్తంలో లేదా విడతల వారీగా రూ.లక్షకు మించి విద్యుత్‌ బిల్లు దాటితే ఐటీఆర్‌ సమర్పించాలి. విదేశీ కంపెనీలలో షేర్లు ఉన్నా లేదా అందులో వాటాలు ఉన్నా లేదా ఆస్తులు ఉన్నా సదరు వ్యక్తి ఐటీఆర్ దాఖలు చేయాలి. విదేశీ ప్రయాణాల్లో రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేసినా ఐటీఆర్‌ దాఖలు చేయాలి. కాగా పూర్తిగా వేత‌నంపైనే ఆధార‌ప‌డిన ఉద్యోగులు ఐటీఆర్‌-1 ఫామ్ స‌బ్మిట్ చేస్తే స‌రిపోతుంది. ఇక స్టాక్‌మార్కెట్లలోని వివిధ సంస్థల ఈక్విటీల్లో పెట్టుబ‌డులతో లాభ‌న‌ష్టాలు ఎదుర్కొనేవారు, ఇత‌ర ప్రొఫెష‌న‌ల్‌, వ్యాపార ఆదాయ మార్గాలు క‌ల వారు ఐటీఆర్‌-2, షేర్ మార్కెట్లలో ఇంట్రాడే, ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్షన్ వ్యాపార లావాదేవీలు జ‌రిపేవారు ఐటీఆర్‌-3 ఫామ్ స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business news
  • central government
  • income tax returns
  • ITR filing
  • july 31st

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions