దేశంలో కోటీశ్వరులకు కొదవ లేదు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్స్ ఉన్నారు. వారు ఎదుగుతూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ముందువరుసలో ఉంటున్నారు. సమాజానికి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో టాప్ డోనర్స్ జాబితాను హురున్ ఇండియా రిలీజ్ చేసింది. 2025 హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తగా ప్రవేశించారు. శివ్ నాడార్ & కుటుంబం రూ. 2,708 కోట్ల విరాళంతో అగ్రస్థానంలో ఉన్నారు. తరువాత ముఖేష్ అంబానీ & కుటుంబం (రూ. 626 కోట్లు), బజాజ్ కుటుంబం (రూ. 446 కోట్లు), కుమార్ మంగళం బిర్లా & కుటుంబం (రూ. 440 కోట్లు), గౌతమ్ అదానీ & కుటుంబం (రూ.386 కోట్లు) ఉన్నారు. నందన్ నీలేకని రూ. 365 కోట్లు విరాళంగా ఇవ్వగా, హిందూజా కుటుంబం రూ. 298 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Also Read:H-1B Visa: అమెరికా వద్దంటుందా..? మేమున్నాం అంటూ కెనడా ఆహ్వానం..
శివ్ నాడార్, అతని కుటుంబం ఐదు సంవత్సరాలలో నాలుగోసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025లో రూ. 2,708 కోట్ల విరాళం ఇచ్చారు. అంటే రోజుకు సగటున రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26% ఎక్కువ. ఈ నిధులలో ఎక్కువ భాగం విద్య, కళలు, సంస్కృతిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ నుంచి వచ్చాయి.
Also Read:Bihar Elections 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్..
టాప్ 10 దాతల నుంచి వచ్చిన విరాళాలు కలిపి రూ.5,834 కోట్లు. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ.626 కోట్ల విరాళాలతో రెండవ స్థానంలో నిలిచారు. ఇది గత సంవత్సరం కంటే 54% ఎక్కువ. వారి విరాళాలు ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ కు మద్దతు ఇచ్చే రిలయన్స్ ఫౌండేషన్‌కు కేటాయించబడ్డాయి. జమ్నాలాల్ బజాజ్ ట్రస్ట్, ఇతర కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.446 కోట్ల విరాళంతో బజాజ్ కుటుంబం మూడవ స్థానంలో ఉంది. కుమార్ మంగళం బిర్లా, అతని కుటుంబం రూ.440 కోట్లతో నాల్గవ స్థానంలో, గౌతమ్ అదానీ, అతని కుటుంబం రూ.386 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి.