థియేటర్‌లో రిలీజయ్యే కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నట్లే.. వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీలో రిలీజయ్యే న్యూ మూవీస్ ఏమున్నాయా అని సెర్చ్ చేస్తుంటారు ఈ వారం కూడా బోలెడు సినిమాలు రాగా.. వాటిల్లో కొన్ని మూవీస్, సిరీస్ ఇంట్ర కలిగిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకె తెరకెక్కించి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు టూ సీజన్స్ ఆకట్టుకోగా.. సీజన్ 3 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
దీపావళికి పోటీ పడ్డ తమిళ సినిమాలు బైసన్, డీజిల్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మారి సెల్వరాజ్ , ధ్రువ్ విక్రమ్ కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా బైసన్.. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుని ఓటీటీ బాట పట్టింది. బైసన్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హారీష్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ డీజిల్ ఏకంగా సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్‌లో ప్రీమియర్ అవుతోంది. మరో తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ నాడు సెంటర్ జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చేసింది. దేవీ ఫేం చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ , శివాజీ, శత్రు కీ రోల్ ప్లే చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కర్మణ్యే వాధికారిస్తే సన్ నెక్ట్స్‌లోకి వచ్చేస్తే .. ఆస్కార్ నామినేషన్‌లో లిస్ట్ అయిన జాన్వీ కపూర్ ఫిల్మ్ హోమ్ బౌండ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పొలిటికల్ థ్రిల్లర్ ది బెంగాల్ ఫైల్స్ జీ5లో ప్రసారం అవుతోంది. అలాగే ర్యాంబో ఇన్ లవ్, న్యూ ఎపిసోడ్స్.. ఉసిరు అనే కన్నడ సినిమా జియో హాట్ స్టార్ అండ్ సన్ నెక్ట్స్‌లో చూసేయొచ్చు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిజిటల్ తెరపై సందడి చేస్తున్నాయి.