Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News There Were Internal Differences In The Trinamool Congress

Kolkata rape case: తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!

Published Date :August 18, 2024 , 3:41 pm
By RAMAKRISHNA KENCHE
  • దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలిపై అత్యాచారం ఘటన
  • ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది
  • సొంత పార్టీలో విభేదాలు
Kolkata rape case:  తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మొదటగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించగా.. ఇప్పుడు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరోగ్య సలహాదారు పదవి నుంచి కూడా తొలగించారు. అయితే.. ఈ ఘటనలో టీఎంసీ పార్టీ నేతలే పరస్పరం తప్పు పట్టుకునే పరిస్థితి దాపరించింది. తాజాగా ఆ పార్టీ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ ఈ కేసు విచారణలో సీబీఐ నిక్కచ్చిగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

READ MORE: Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్‌లు” ..

కళాశాల మాజీ ప్రిన్సిపల్‌, పోలీస్‌ కమిషనర్‌ను కస్టోడియల్‌ విచారించాలని కోరారు. అత్యాచారం ఘటనను ఆత్మహత్యగా ఎందుకు మార్చాలనుకున్నారో తెలియాలన్నారు. అసలు సెమినార్‌ హాల్‌ కి సంబంధించిన గోడను ఎందుకు నేలమట్టం చేశారని ప్రశ్నించారు. నిందితుడు అంత శక్తిమవంతంగా మారేందుకు కారణమెవరని మండిపడ్డారు. పోలీసు జాగిలాలను రప్పించేందుకు మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు.

READ MORE:Crime News: దారుణం.. భార్యను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిన భర్త

ఈ మేరకు సుఖేందు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేయగా.. దానిపై సొంత పార్టీకి చెందిన మరో నేత కునాల్‌ ఘోష్‌ స్పందించారు. సుఖేందు శేఖర్‌ రాయ్‌ పోస్టును రీపోస్టూ చేస్తూ.. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీ శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. సీపీపై వస్తున్న డిమాండ్లను వ్యతిరేకిస్తున్నానన్నారు. దర్యాప్తు సానుకూల కోణంలో సాగుతోందని పేర్కొన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడి నుంచి ఇలాంటి పోస్ట్ రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. జాగిలాల విషయంలో పార్టీ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసుపై మాట్లాడిన భాజపా నేత లాకెట్‌ ఛటర్జీ, వైద్యులు కునాల్‌ సర్కార్‌, సుబర్నో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Internal Differences
  • Kolkata Doctor case
  • kolkata rape case
  • LATEST TELUGU NEWS
  • Mamata Banerjee

తాజావార్తలు

  • Story Board: ఎన్నికల సమయంలో ఉచితాలు బాధ్యతారాహిత్యం..

  • Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..

  • Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..

  • Multi Millet Masala Khichdi Recipe: రెగ్యులర్‌గా రైస్‌ అంటే బోర్.. చిరు ధాన్యాలతో మసాలా కిచిడీ ఇలా తయారు చేయండి.. మిగిలితే ఒట్టు..!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

ట్రెండింగ్‌

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions