Cpi : “అలయ్ బలయ్”పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు.. వేదికపై కూనంనేని, రానన్న నారాయణ
- “అలయ్ బలయ్”పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు
- వేదికపై రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- హాజరు కాలేను క్షమించండన్న నారాయణ
అలయ్ బలయ్పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు. మరోవైపు అలయ్ బలయ్ వేదిక పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అభిప్రాయాలు పంచుకుని.. మానవత్వం చాటుకునే వేదిక అని కునంనేని ప్రస్తావించారు.
READ MORE: Siddique Murder Case: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిద్ధిక్ హత్య కేసు విచారణ: సీఎం షిండే..
నారాయణ ఎమన్నారు?
నా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు నన్ను ఆహ్వానించే మీ “అలయ్ బలయ్” కార్యక్రమానికి నేను హాజరు కాలేను క్షమించండి అంటూ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ మీకు తెలుసు.. ప్రముఖ మేధావి, ఢిల్లీలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగులుగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. విచారణలో హక్కుగా ఉన్న బెయిల్ కూడా తిరస్కరించబడింది. చివరకు 10 ఏళ్ల తర్వాత గౌరవ న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా నిర్ధారించిందని వెల్లడించారు. నేను, నా పార్టీ ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాలను అంగీకరించకపోవచ్చు, కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. చివరికి రాజ్యం… ఈ ప్రపంచం నుండి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు. మీరు పెద్దవారు.. కానీ అంతిమంగా మీరు అదే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. అతని మరణానికి ఈ ప్రభుత్వమే కారణంగా నిలిచిందన్నారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు కానీ నిరసనగా మీరు నిర్వహించే కార్యక్రమానికి నేను హాజరు కాలేనని తెలిపారు.
తాజావార్తలు
-
New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
-
MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
-
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
-
Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!
-
Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?