Young woman attempted suicide in Ghatkesar: ప్రేమించిన వాడి మోసంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వరంగల్ హైవేలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… Also Read: NKR21: ‘రాములమ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫస్ట్ లుక్, గ్లింప్స్…
ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో దారుణం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై రాడ్డుతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాధితురాలు కమలా నెహ్రూ కాలేజీకి చెందిన విద్యార్థిని నర్గీస్ కాగా.. ఆమెపై నిందితుడు రాడ్డుతో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.
రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలో ఉన్న తిరువళ్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వేడి సాంబారు గిన్నెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఓ 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.
తన పేరు, ఫోన్ నంబర్‌ను ప్రస్తావిస్తూ.. తనతో శృంగారం చేయాలనే కోరిక ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ పలువురికి చిట్టీలు విసిరిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.
మానవత్వం మంట కలిసింది.. తోటి స్నేహితురాలి పట్ల జాలి చూపాల్సిన ఓ యువతి.. రాక్షసంగా ప్రవర్తించింది. పాక్‌లో తన తండ్రిని పెళ్లి చేసుకోవాలంటూ మెడికల్ విద్యార్థినిపై ఒత్తిడి చేసింది తోటి స్నేహితురాలు. అందుకా యువతి నిరాకరించింది. తన కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ఫ్రెండ్.. తండ్రితో కలిసి యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టింది. అంతేకాదు.. సారీ చెప్పాలని ఆమెతో బూట్లు, చెప్పులు నాకించారు. ఎంత…