Bellamkonda Suresh: తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా, ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ కారు చోరీకి గురై వార్తల్లో నిలిచారు. బెల్లంకొండ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం ముందు తన బెంజ్ కారును పార్క్ చేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కారు వెనుక అద్దం పగిలి ఉండడాన్ని గమనించారు. దీంతో పరుగున కారుకీసు తీసి పరిశీలించగా అందులో ఉన్న విలువైన వస్తువులు మిస్ అయ్యాయి. ఇందులో రూ. 50 వేల నగదు, 11 కల్తీ మందు బాటిళ్లు బెట్టినట్లు అవి దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. దీంతో భయాందోళన చెందిన బెల్లంకొండ భార్య పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పరిశీలించారు. కారులో నగదు, మద్యం బాటిళ్లు ఉండటాన్ని ముందుగా దుండగులు గమనించి ఉంటారని భావిస్తున్నారు. అయితే కారు పార్కింగ్ చేసే సమయంలో అందులోనగదు ఎందుకు పెట్టారు? మద్యం బాటిళ్లు ఎందుకు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ గమనించిన దుండగులు ఈ చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే కారు పార్కింగ్ చేసిన ప్రాంతంలో సెక్యూరిటీ ఉన్నాడా? ఒక వేళ ఉంటే కారు అద్దాలు పగలకొడుతున్నప్పుడు ఆ చప్పుడు ఎందుకు వినిపించలేదనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Colombia: విమాన ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు
నిర్మాత బెల్లంకొండ.. బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మీ నరసింహ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్‌తో ‘రభస’, రామ్‌తో ‘కందిరీగ’ చిత్రాలకు నిర్మాత కూడా. కాగా, ఆయన ఇద్దరు కుమారులు బెల్లకొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ హీరోలుగా రాణిస్తున్నారు. శ్రీనివాస్ ఇటీవల ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌ను ఎదుర్కొన్నాడు. ‘స్వాతిముత్యం’ సినిమాతో తెరంగేట్రం చేసిన గణేష్ ఇటీవల ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మొత్తానికి కొడుకులను హీరోలుగా చేయాలనే తపనతో ఉన్న బెల్లకొండ సురేష్ నిర్మాతగా సినిమాలు తగ్గించుకున్నాడు.
Colombia: విమాన ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత సజీవంగా దొరికిన చిన్నారులు