Gujarat: ఉద్యోగం నచ్చలేదని తన వేళ్లు తానే కోసుకున్న యువకుడు..
- కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు
- ఆ జాబ్‌ను వదిలేయడానికి తన నాలుగు వేళ్లను తానే కోసుకున్న మయూర్
- గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం చేసే పని నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాత మానేస్తాం.. నచ్చిన ఉద్యోగం దొరికాక అందులో జాయిన్ అయి సంతోషంగా పని చేస్తాం. కొన్నిసార్లు ఎన్ని డబ్బులు వచ్చినా.. చేసే పని నచ్చకపోతే అందులో ఇమడలేకపోతాం. తాజాగా.. ఇక్కడ కూడా అలాంటి సంఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఆ జాబ్‌ను వదిలేయడానికి తన నాలుగు వేళ్లను తానే కోసుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.
Read Also: PV Sindhu : సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన పీవీ సింధు
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
యువకుడు తన బంధువు దగ్గర డైమండ్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. అయితే.. ఆ ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని.. మానేస్తున్నానని తన బంధువుతో చెప్పే ధైర్యం లేక ఈ ఘటనకు పాల్పడ్డాడు. కంప్యూటర్‌ను ఆపరేట్ చేసే ఎడమ చేతి నాలుగు వేళ్లను పదునైన కత్తితో తనకు తానే కోసుకున్నాడు. బాధిత యువకుడు మయూర్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం యువకుడు రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి వచ్చి చూస్తే తన వేళ్లు లేవు. పోలీసుల కథనం ప్రకారం.. ఎవరైనా చేతబడి కోసం అతని వేళ్లను కత్తిరించి ఉంటారని అనుమానించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తన వేళ్లను తానే కోసుకున్నాడని తేలింది.
Read Also: CP CV Anand : మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించిన సీపీ సీవీ ఆనంద్
ఓ షాపులో కత్తి కొన్నట్లు యువకుడు మయూర్ అంగీకరించాడు. శనివారం రాత్రి అమ్రోలి రింగ్ రోడ్డుకు వెళ్లి అక్కడ తన ద్విచక్రవాహనాన్ని పార్క్ చేశాడు. ఆ తర్వాత నాలుగు వేళ్లను కత్తితో కట్ చేసుకున్నాడు. అనంతరం.. కత్తి, కట్ చేసిన వేళ్లను బ్యాగ్‌లో పెట్టి దూరంగా పడేశాడు. ఈ ఘటనపై యువకుడు తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. యువకుడు పడేసిన బ్యాగ్‌లో మూడు వేళ్లు, మరో బ్యాగ్‌లో కత్తి లభించినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!