NTV Telugu Site icon

TS High Court: జన్వాద ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ.. హైడ్రా విధివిధానాలు స్పష్టం

Ts High

Ts High

జన్వాద ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

READ MORE: Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్.. ఇండియన్ ఐడల్లో అదరగొట్టాడు!

జన్వాడ ఫార్మ్ హౌస్ లో నిర్మించిన భవనాలకు స్థానిక సర్పంచ్ అనుమతి ఇచ్చారని.. పంచాయితీ తీర్మానం లేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వివరించారు. ఆ భూమి ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉందా? లేదా అన్నది స్పష్టత కావాలని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు ఈ పిటిషన్ ను ముగించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను జీవో19 ప్రకారం నిబంధనల మేరకే హైడ్రా నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాను సూచించింది.

READ MORE: Bandru Sobharani: కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘాటు వ్యాఖ్యలు!

కాగా.. తాజాగా ఫాం హౌస్ పై కేటీఆర్ మాట్లాడారు. నాకంటూ ఎలాంటి ఫాం హౌస్ లేదని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. నా మిత్రుడి ఫాం హౌస్ ను నేను లీజుకు తీసుకున్నానని అన్నారు. ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తా అన్నారు. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి, నేతలు కె.వి.పి రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ లను కూల్చాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫాం హౌస్ నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. నాకు ఎలాంటి ఫాం హౌస్ లేదు.. వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ నీళ్ళల్లో ఉందన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉందన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోండన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి స్టార్ట్ చేయండి అని డిమాండ్ చేశారు. రేపు చేవెళ్లలో జరిగే రైతు నిరసన కార్యక్రమంలో నేను పాల్గొంటానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.