Baby Kidnap: వస్తువులు అమ్మే వారితో జాగ్రత్త.. ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిని ఎత్తుకెళ్లిన దొంగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాగ్‌లు అమ్మే నెపంతో ఓ ఇంట్లోకి నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించిన దొంగ.. చిన్నారిని చంకలో పెట్టుకుని పారిపోయాడు. స్థానికులు అతని కోసం వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రుద్రనగర్ లో చోటు చేసుకుంది. ఈ విషయంపై చిన్నారి తల్లి షీలా బధోయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపింది.
Read Also: Nifty: నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఆ స్థాయిలో ట్రేడవడం ఇదే తొలిసారి
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తమ రెండున్నరేళ్ల కుమార్తె పరి ఇంట్లో నిద్రిస్తోందని తల్లి షీలా బధోయ్ పేర్కొన్నారు. తాము బయట పనిచేసుకుంటూ ఉన్నామని.. ఇంతలో తమ కూతురును కిడ్నాప్ చేసి పారిపోతున్నారని చెప్పారు. దీంతో.. గమనించిన స్థానికులు దొంగను వెంబడించడంతో చిన్నారిని ఒక వీధిలో వదిలి పారిపోయాడు. ప్రజలు అప్రమత్తమై అతనిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని కొత్వాలి పోలీసులకు అప్పగించారు. కాగా.. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. తమ ప్రాంతానికి ఎవరూ రాలేదని చెప్పారు.
Read Also: Manam: మళ్ళీ మెస్మరైజ్ చేస్తోన్న మనం.. వైరల్ అవుతున్న వీడియోలు
కాగా.. పోలీసుల విచారణలో నిందితుడిని పర్వేష్గా గుర్తించారు. నిందితుడు బరేలీకి చెందినవాడు.. ఈ ఘటనపై బుధవారం పోలీసు ఏరియా అధికారి నిహారిక మెహ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై వివరాలు వెల్లడించారు. నిందితుడు డ్రగ్స్కు బానిసయ్యాడని చెప్పారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఎలాంటి సమచారం ఇవ్వలేదు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. శిశువుల అక్రమ రవాణాకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిందితుడికి వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.
- Tags
- baby
- kidnap
- police
- telugu news
- thief
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!