దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక దళిత పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థిపై విద్యావ్యవస్థ వేటు వేసింది. ఏకంగా రెండేళ్ల పాటు అన్ని క్యాంపస్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకటించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే విద్యార్థి రామదాస్ ప్రిని శివనాదన్‌ను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రం విధానాలను ప్రశ్నించినందుకే దళిత పీహెచ్‌డీ స్కాలర్ విద్యార్థిని టీఐఎస్ఎస్ సస్పెండ్ చేసిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: Lok Sabha Elections 2024: హిడ్మా భయం.. బస్తర్ దండకారణ్యంలో ఈ గ్రామం నుంచి ఒక్కరు ఓటేయలేదు..
ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్లమెంటు మార్చ్‌లో రామదాస్ ప్రిని శివనాదన్ పాల్గొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం.. కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టాడు. దీంతో రామదాస్‌కు మార్చి 7న విద్యాసంస్థ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నాడు. ప్రత్యేకంగా జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ నిరసనల్లో పాల్గొని రామ్ కే నామ్ డాక్యుమెంటరీని చూడాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చాడు. ఇదే రామదాస్ కొంపముంచింది. ఇది జాతీయ వ్యతిరేక చర్యగా సంస్థ పేర్కొంది. దీంతో స్టూడెంట్‌ను రెండేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Ram Charan: గేమ్ చేంజర్ లో మరో రికార్డ్ బ్రేకింగ్ ఫైట్.. కాస్కోండి!
రామ్ కే నామ్ డాక్యుమెంటరీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించినట్లు సమాచారం. దీన్ని క్యాంపస్‌లో కూడా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇక 2020 జాతీయ విద్యా విధానానికి నిరసనగా విద్యార్థి సంఘాలు పార్లమెంట్ మార్చ్ నిర్వహించాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే దీన్ని క్యాంపస్ సీరియస్‌గా తీసుకుంది. దీంతోనే రామదాస్‌ను రెండేళ్లు సస్పెండ్ చేసింది. ఈ చర్యను విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. బీజేపీకి మద్దతుగా విద్యాసంస్థలు పని చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రస్తుతం రామదాస్ ఎస్‌ఎఫ్‌ఐలో కీలక పదవుల్లో ఉన్నాడు. ముంబై, గౌహతి, హైదరాబాద్ మరియు తుల్జాపులోని భారతదేశంలోని అన్ని TISS క్యాంపస్‌లలోకి రామదాస్ ప్రవేశించకుండా నిషేధించింది.
ఇది కూడా చదవండి: Vishal: ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పను కానీ!!.. హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు