Ram Charan to Fight with 1000 people in Game Changer Climax: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాలో రామ్ చరణ్ చేయబోతున్న ఒక ఫైట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాధారణంగానే శంకర్ సినిమా అనగానే చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది. పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా రిచ్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు. గేమ్ చేంజర్ క్లైమాక్స్ కూడా అదే రేంజ్ లో శంకర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Harish Shankar: ఛోటా కే నాయుడికి హరీష్ శంకర్ బహిరంగ లేఖ.. మళ్ళీ కెలికితే అంటూ!
రామ్ చరణ్ ఒకే సమయంలో వెయ్యి మందితో ఫైట్ చేసేలా ఒక ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. త్వరలో జరగబోతున్న షూటింగ్ షెడ్యూల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని వెయ్యి మంది లోకల్ ఇంటర్నేషనల్ ఫైటర్లతో రామ్ చరణ్ తేజ్ ఫైట్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక ఈ సీక్వెన్స్ మొత్తాన్ని హాలీవుడ్ కి చెందిన స్టంట్ కోఆర్డినేటర్లు కోఆర్డినేట్ చేయబోతున్నారు రామ్ చరణ్ గత సినిమా ఆర్ఆర్ఆర్ లో కూడా అలాగే ఒక భారీ ఫైట్ సీన్ ఉంటుంది. రామ్ చరణ్ ఎలివేషన్ కోసం ఆ ఫైట్ సీన్ బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఏకంగా వెయ్యి మందితో ఫైట్ సీన్ అంటే కచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టేలా ఉండబోతుందని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.