Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: Hotel Attack: హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌పై దాడి.. మేనేజర్ దగ్గరుండి మరీ..!
మానసిక స్థితిలో మెరుగుదల:
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కౌగిలింతలు ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని, ముఖ్యంగా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయని తేలింది. నిజానికి మీరు ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు శరీరం ఆక్సిటోసిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనిని ‘ప్రేమ హార్మోన్’ అని కూడా అంటారు. శరీరంలో ఉండే ఈ హార్మోన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ద్వారా మెరుగైన మానసిక స్థితిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
బలమైన రోగనిరోధక వ్యవస్థ:
కౌగిలింతలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. కొన్ని పరిశోధనలలో కౌగిలించుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందట. ఇది ఒక వ్యక్తిని వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యం:
కౌగిలించుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కౌగిలింతలు వాస్తవానికి ఆక్సిటోసిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తపోటు నియంత్రణ:
కౌగిలించుకోవడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల శరీరమంతా ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. దీనిని శాస్త్రీయంగా ‘కడిల్ హార్మోన్’ అని పిలుస్తారు.
నిరాశ, ఒంటరితనాన్ని తొలగిస్తుంది:
కౌగిలింతలు నిరాశ, ఒంటరితనాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్, సెరోటోనిన్ హార్మోన్ల స్థాయిలు తక్షణమే పెరుగుతాయి. ఇది ఒంటరితనం, కోపం వంటి కొన్ని ప్రతికూల భావోద్వేగాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దానితో మనస్సులో సంతోషంగా, రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.