ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌తో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రేలర్ కు మంచి స్పందన లభించింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ బెస్ట్ మూవీస్ ఇవే
ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెకండ్ సింగిల్ కోసం ప్రత్యేక ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించబోతున్నారు. ఈ గురువారం అనగా డీసెంబరు 18న సెకండ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ సాంగ్ కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. ఫస్ట్ లిరికల్ సాంగ్ లో ప్రభాస్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. వింటేజ్ ప్రభాస్ ను చూశామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఇక రాబౌయే సెకండ్ లిరికల్ సాంగ్ లో కూడా డార్లింగ్ క్యూట్ లుక్స్ లో దర్శనమివ్వనున్నాడట. చెన్నైలో జరగబోయే ఈ ఈవెంట్ కు ప్రభాస్ కూడాహాజరయ్యే ఛాన్స్ ఉంది.