The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా వసూళ్లపై విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మేము మొదటి రోజు 100 కోట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం 112 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలను సేకరించి ప్రచురించడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ, ఈ స్థాయి విజయం మాకు చాలా సంతోషాన్నిచ్చింది” అని తెలిపారు.
READ ALSO: Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఈ సినిమా కేవలం మాస్ ఆడియన్స్‌కే కాకుండా, ఫ్యామిలీలకు కూడా బాగా నచ్చుతోందని ఆయన పేర్కొన్నారు. “ఇది హారర్ ఫాంటసీ మూవీ కావడంతో పిల్లలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. అక్కడక్కడా మిక్స్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ జోరు సంక్రాంతి వరకు ఇలాగే కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిమానులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ.. సినిమాలో ఒక సాంకేతిక సమస్య వల్ల మిస్ అయిన సీన్ల గురించి ఆయన వివరించారు. సర్వర్ డౌన్ అవ్వడం వల్ల సుమారు 4 నిమిషాల నిడివి గల క్యూ క్లీనప్ అవుట్‌పుట్ సకాలంలో రాలేదు. కొన్ని చిన్న చిన్న కరెక్షన్లతో కూడిన ఆ 4 నిమిషాల కంటెంట్‌ను నిన్న రాత్రి మరియు ఈరోజు తెల్లవారుజామున థియేటర్లకు పంపాము. క్యూబ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, ఈ కంటెంట్ నేరుగా థియేటర్లలో అందుబాటులోకి వస్తుంది. ప్రభాస్ మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఇలాంటి వైవిధ్యమైన ఫాంటసీ సినిమాలను కూడా అభిమానులు ఆదరిస్తున్నందుకు ఆయన మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
READ ALSO: Reliance Jio IPO: స్టాక్ మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..