NTV Telugu Site icon

Viral News: ఆస్పత్రికి వచ్చి రెండ్రోజులు లిఫ్ట్లోనే చిక్కుకున్న రోగి..

Lift

Lift

కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో చాలా మంది సిబ్బంది సెలవులో ఉండడంతో ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కున్న విషయం ఆస్పత్రికి కూడా తెలియలేదు. ఉల్లూరుకు చెందిన రవీంద్రన్ నాయర్ (59) శనివారం తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఓపీ బ్లాక్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కగా మధ్యలోనే ఆగిపోయింది.

Rakul Preet Brother: రకుల్ సోదరుడితో పాటు సినీ ప్రముఖుల అరెస్ట్?

రోగి రవీంద్రన్ మాట్లాడుతూ.. తాను సహాయం కోసం అరిచానని.. కాని నా మాటలు ఎవరూ వినలేదన్నాడు. మరోవైపు.. ఆ సమయంలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని తెలిపాడు. కాగా.. ఆదివారం రాత్రి రవీంద్రన్ కుటుంబసభ్యులు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెడికల్ కాలేజీ పోలీసులు విచారణ ప్రారంభించారు. రవీంద్ర చెకప్ కోసం మెడికల్ కాలేజీకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి చెందిన లిఫ్ట్‌ ఆపరేటర్‌ లిఫ్ట్‌ తెరిచి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు రవీంద్రన్. వెంటనే అతనికి వైద్య చికిత్స అందించారు. 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయాడు. వైద్య కళాశాల నిర్లక్ష్యమే లిఫ్ట్‌ ఇలా నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో అతిథుల చేతికి రంగు రంగుల బ్యాండ్లు..ఎందుకో తెలుసా..?

కాగా.. వెన్నునొప్పికి చికిత్స కోసం శనివారం ఉదయం ఆర్థోపెడిక్ విభానికి వచ్చాడు. డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్న తర్వాత.. ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం రవీంద్రన్ మళ్లీ ఆసుపత్రికి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు లిఫ్ట్ లో వెళ్లాడు. కాగా.. అకస్మాత్తుగా లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయింది. కాగా.. సోమవారం ఉదయం తమ రోజువారీ పనుల నిమిత్తం వచ్చిన సిబ్బంది లిఫ్ట్‌లో ఎవరో చిక్కుకున్నట్లు గుర్తించారు. అనంతరం లిఫ్ట్‌ను ఆపరేట్‌ చేసి అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.