Rakul Preet Singh Brother Arrested: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి తమకు అందిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. అతని వద్ద సుమారు 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇద్దరు నైజీరియన్లను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి హైదరాబాదులో నైజీరియన్ల అమ్ముతున్నట్లు వెల్లడించారు.
Gauri Krishna: చంపేస్తామంటున్నారు.. పోలీసులకు పొలిమేర నిర్మాత ఫిర్యాదు
నైజీరియన్లతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రెస్ మీట్ లో వెల్లడించారు ఈ కేసులో రెండు పాస్పోర్ట్లు, 10 సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విఐపిలే టార్గెట్గా హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. హైదర్ షా కోట్ లో రైడ్ చేసి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశామని డీసీపీ శ్రీనివాస్ అన్నారు. నిజానికి తమకు అందిన టిప్ మేరకు డ్రగ్స్ అమ్మేవారు కొనుగోలు చేసేవారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అరెస్ట్ చేశామని అన్నారు. ఒనౌహా బ్లెస్సింగ్(వెస్ట్ ఆఫ్రికా), అజీజ్ నొహీం, అల్లం సత్య వెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహమ్మద్ మహబూబ్ షరీఫ్ లను అరెస్ట్ చేశారు. అమన్ ప్రీత్ సింగ్ అయితే డ్రగ్స్ వాడకం దారుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.