Viral News: ఆస్పత్రికి వచ్చి రెండ్రోజులు లిఫ్ట్లోనే చిక్కుకున్న రోగి..
- ఆస్పత్రికి వచ్చి రెండ్రోజులు లిఫ్ట్లోనే చిక్కుకున్న రోగి
- కేరళలోని తిరువనంతపురంలో ఘటన
- గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కిన రోగి
- మధ్యలోనే ఆగిపోయి రెండు రోజులు నరకయాతన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి రెండు రోజులుగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండ్రోజులు నరకయాతన అనుభవించిన అతను.. ఈరోజు లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు అరిచినా అతని అరుపులు బయటి వారికి వినిపించలేదు. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో చాలా మంది సిబ్బంది సెలవులో ఉండడంతో ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కున్న విషయం ఆస్పత్రికి కూడా తెలియలేదు. ఉల్లూరుకు చెందిన రవీంద్రన్ నాయర్ (59) శనివారం తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఓపీ బ్లాక్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కగా మధ్యలోనే ఆగిపోయింది.
Rakul Preet Brother: రకుల్ సోదరుడితో పాటు సినీ ప్రముఖుల అరెస్ట్?
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
రోగి రవీంద్రన్ మాట్లాడుతూ.. తాను సహాయం కోసం అరిచానని.. కాని నా మాటలు ఎవరూ వినలేదన్నాడు. మరోవైపు.. ఆ సమయంలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని తెలిపాడు. కాగా.. ఆదివారం రాత్రి రవీంద్రన్ కుటుంబసభ్యులు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెడికల్ కాలేజీ పోలీసులు విచారణ ప్రారంభించారు. రవీంద్ర చెకప్ కోసం మెడికల్ కాలేజీకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి చెందిన లిఫ్ట్ ఆపరేటర్ లిఫ్ట్ తెరిచి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు రవీంద్రన్. వెంటనే అతనికి వైద్య చికిత్స అందించారు. 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో స్పృహ కోల్పోయాడు. వైద్య కళాశాల నిర్లక్ష్యమే లిఫ్ట్ ఇలా నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో అతిథుల చేతికి రంగు రంగుల బ్యాండ్లు..ఎందుకో తెలుసా..?
కాగా.. వెన్నునొప్పికి చికిత్స కోసం శనివారం ఉదయం ఆర్థోపెడిక్ విభానికి వచ్చాడు. డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్న తర్వాత.. ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం రవీంద్రన్ మళ్లీ ఆసుపత్రికి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు లిఫ్ట్ లో వెళ్లాడు. కాగా.. అకస్మాత్తుగా లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయింది. కాగా.. సోమవారం ఉదయం తమ రోజువారీ పనుల నిమిత్తం వచ్చిన సిబ్బంది లిఫ్ట్‌లో ఎవరో చిక్కుకున్నట్లు గుర్తించారు. అనంతరం లిఫ్ట్‌ను ఆపరేట్ చేసి అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!