NTV Telugu Site icon

Anna Canteens: ముస్తాబవుతున్న అన్నా క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ

Anna Canteens Copy

Anna Canteens Copy

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను కూడా రూపొందించారు. తాజాగా అన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ నెల 10నాటికి అన్నా క్యాంటీన్లు సిద్ధం చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి మరో 83 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది.

READ MORE: Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్‌.. ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు!

కాగా.. పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడంతో ధరలు ఎల ఉండబోతున్నాయనే చర్చకు సీఎం గతంలో సమాధానమిచ్చారు. సీఎంగా నాలుగో ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు..ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.