Anna Canteens: ముస్తాబవుతున్న అన్న క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
- ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్నా క్యాంటిన్లు ప్రారంభం
- రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న అందుబాటులోకి 100 అన్నా క్యాంటీన్లు
- ఈ నెల 10నాటికి సిద్ధం చేయాలని ఆదేశం
- రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో ఆహర సరఫరా చేపట్టనున్న హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్
- అన్న క్యాంటీన్లకు ఆ టెండర్లలో ఎల్-1గా హరేకృష్ణ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను కూడా రూపొందించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ నెల 10నాటికి అన్నా క్యాంటీన్లు సిద్ధం చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి మరో 83 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది.
READ MORE:Anna Canteens: ముస్తాబవుతున్న అన్నా క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆహర సరఫరా చేపట్టనుంది. 203 అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా చేయనుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరఫరా చేయనున్నారు. అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాకు పిలిచిన టెండర్లలో ఎల్-1గా హరేకృష్ణ సంస్థ నిలిచింది. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. రోండో విడడతలో 83.. మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.
READ MORE: Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు!
కాగా.. పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడంతో ధరలు ఎల ఉండబోతున్నాయనే చర్చకు సీఎం గతంలో సమాధానమిచ్చారు. సీఎంగా నాలుగో ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు..ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!