NTV Telugu Site icon

KTR: తెలంగాణ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం.. కేటీఆర్‌ కీలక నిర్ణయం

Ktr Group1

Ktr Group1

పోరాటం మనేది బీఆర్‌ఎస్‌ కి కొత్త ఏం కాదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ నిర్వహించిన బీఆర్‌ఎస్‌వీసమావేశంలోఆయన మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం.. రేవంత్ రెడ్డి ఎంత? అన్నారు. నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తీ మనకి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. భారత దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎందరో విద్యార్థి అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చిన తెలంగాణ భవన్ హక్కున చేర్చుకుంటుందని.. వారికి అండగా ఉంటుందని చెప్పారు.

READ MORE: Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్

జీవో 29 వల్ల గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అశోక్ నగర్ చుట్టు పోలీసుల ఉన్నారని తెలిపారు. గ్రూప్-1అభ్యర్థులే తెలంగాణ భవన్ కు వచ్చారని.. వారికి అండగా బీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రుణమాఫీ ఊసే లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఢిల్లికీ మూటలు తీసుకోని పోతున్నారని.. ఇప్పటి వరకు 25 సార్లు ఢిల్లీ పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారని.. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మూసి పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుంటే బీజేపీ మౌనంగా ఉంటుందన్నారు.

READ MORE:Sheikh Hasina: షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ..

“డిసెంబర్ 3న బీఆర్‌ఎస్ ఒడిపోతుందని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ప్రజలు బీఆర్‌ఎస్‌ ను ప్రతి పక్షంలో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో బీజేపీ మరింత ప్రమాదకరమైన పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలతో బీఆర్‌ఎస్‌ పోరాడాలి. ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్‌వీ సదస్సు పెట్టుకోవాలి. కమిటీలు వేసుకోవాలి. నా కంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు బీఆర్‌ఎస్‌వీలో ఉన్నారు. మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుంది. ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే ఒక్క మీడియా చూపించడం లేదు. అందుకే సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి కాలేజీలో బీఆర్‌ఎస్‌వీ జెండా ఉండాలి. బ్యానర్ ఉండాలి. ఆ విధంగా విద్యార్థులు పోరాటం చెయ్యాలి. డి లిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వారికి భవిష్యత్తు ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడి దాడులు జరిగినాయి ..ఎటువంటి సమాచారం బయటకు రాలే… బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు అనడానికి ఇదే నిదర్శనం. మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో గెలుస్తున్నాం ధీమానే మనల్ని కొంప ముంచింది… మేము అంతే ధీమాలో ఉండడంతో ఓడిపోయాము. చిన్న చిన్న పొరపాట్లు చేశాం,వాటిని సవరించుకుందాం, ప్రజలకు దగ్గర అవుదాం విద్యార్థి నాయకులదే భవిష్యత్. బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ దో కాదు మన అందరిదీ. ఇంకో 50 నుంచి 75 యేండ్ల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుంది. అని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.