Russia-Ukraine War: రాజుకున్న యుద్ధం.. ఉక్రెయిన్‌పై అణు రహిత క్షిపణి ప్రయోగం
- ఉక్రెయిన్-రష్యా మధ్య రాజుకున్న యుద్ధం
- ఉక్రెయిన్‌పై అణు రహిత క్షిపణి ప్రయోగం
- దెబ్బతిన్న డ్నిప్రో నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య మరోసారి భీకరమైన యుద్ధం మొదలైంది. రెండేళ్ల నుంచి యుద్ధం నడుస్తుండగా.. ఈ మధ్య కొద్దిగా నెమ్మదించింది. అయితే తాజాగా మరోసారి రెండు దేశాలు కాలుదువ్వుకుంటున్నాయి. ఇటీవల రష్యాపై అమెరికా రహిత క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో యుద్ధం చల్లబడుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణు దస్త్రంపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ని ప్రయోగించింది. రెండేళ్లలో ఉక్రెయిన్‌పై ఈ క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి. రాత్రిపూట ఈ క్షిపణిని ప్రయోగించింది. డ్నిప్రో నగరాన్ని తాకినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: అమ్మమ్మ జ్ఞాపకార్థం 20 వేల మందికి భారీ విందు ఇచ్చిన బిచ్చగాడు (వీడియో)
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ఏ రకమైన క్షిపణి ప్రయోగించారో ఇప్పటి వరకు రష్యా స్పష్టంగా ప్రకటన చేయలేదు. కానీ ఉక్రెయిన్ వైమానిక దళం మాత్రం గురువారం టెలిగ్రామ్‌లో రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఇలాంటి క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇప్పటికే రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు రంగంలోకి దిగాయి. తాజా యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా దాడులతో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేసినట్లుగా తెలుస్తోంది. డ్నిప్రో నగరానికి భారీ నష్టం జరిగినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: AP Assembly: ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్
ఇదిలా ఉంటే రష్యా దాడులను అమెరికా ముందుగానే పసిగట్టింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కార్యాలయాన్ని మూసివేశారు. అమెరికాతో పాటు ఇటలీ, స్పెయిన్ సహా పలు దేశాలు ఎంబసీ కార్యాలయాలను మూసివేశారు. రష్యా దాడులకు ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. భారీ ఆయుధాలను సరఫరా చేస్తోంది. తాజా యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి.
ఇది కూడా చదవండి: BJP: అదానీ లంచం ఆరోపణల్లో ప్రతిపక్ష రాష్ట్రాల పేర్లు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్..
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!