Atrocious : హత్యల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక్క దెబ్బతో చంపితే బాగోలేదని.. జనాలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. చంపినా కసి తీరట్లేదేమో.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఇది ఆ మధ్య జరిగిన శ్రద్ధావాకర్ హత్య నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ముక్కలుగా నరికిన హత్య వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరిగిన ఘటనలు సంచలనంగా మారగా తాజాగా ఒడిశాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. ఓ భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కాడు. హత్య అనంతరం వాటిని ఎవరూ లేని ప్రాంతంలో పారేశాడు.
Read Also:BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని పలాసియా గ్రామంలో సాధబ్ దాస్, మామాదాస్ జంటకు పదేళ్ల కిందట వివాహం అయ్యింది. వారిద్దరు సాధబ్ తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గత ఆదివారం కూడా గొడవ జరిగింది. కోపంలో అతడు తన భార్యను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ గోనె సంచిలో వేసుకుని.. గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అతడు పడేసేటప్పడు పలువురు అతడిని గమనించారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ చోట గోనె సంచిలో మామాదాస్ ముక్కలుగా పడివున్న మృతదేహం కనిపించింది. వెంటనే బస్తా పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also:Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి