సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వంచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదేతరహాలో ఇన్స్టా గ్రామ్ లో బాలికలను పరిచయం చేసుకుని.. ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. ఇటీవల అల్వాల్ పరిధిలో ఇద్దరు బాలికలు మిస్ అయిన విషయం తెలిసిందే. తమ కూతుర్లు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు…
OYO : ఓయో మ్యాజిక్ కొనసాగుతుంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.166 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం కంపెనీ లాభం రూ. 25 కోట్లు. ఇందులో ఆరు రెట్లు పెరుగుదల ఉంది.
OYO: ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఓయో రూపొందించిన పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు.. కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లోనైనా రూమ్స్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెసుకున్నట్లు రుజువును చూపించాల్సి ఉంటుంది.
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్‌లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024' నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
రామంతపూర్ ఓయో రూంలో ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు.
యూపీ రాజధాని లక్నోలోని దేవా రోడ్‌లో ఉన్న ఓయో రెడ్ బిల్డింగ్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 105లో 22 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. అమ్మాయి బారాబంకి నివాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య, వారణాసి, తిరుపతి, కత్రా-వైష్ణో దేవి వంటి ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలలో 400 ప్రాపర్టీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి విస్తరణను చేపట్టనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.
Oyo : గత శనివారం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడంతో అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
OYO: ఓయో హోటల్‌లో రెండు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఓ యువకుడు మహిళను హోటల్‌కు పిలిచి హత్య చేసి తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.