చెమటలు పట్టిస్తున్న సమ్మర్ కి కూడా సెగలు పుట్టించే రేంజులో సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది సోనాల్ చౌహాన్. బాలీవుడ్ డెబ్యు ఇచ్చిన ఈ 35 ఏళ్ల హీరోయిన్, అక్కడి నుంచి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్ సినిమాలో గ్లామర్ షోకి సోనాల్ చౌహాన్ కి తెలుగులో అవకాశాలు రావడం మొదలయ్యాయి. మంచి హైట్, సూపర్బ్ ఫిజిక్ మైంటైన్ చేసే సోనాల్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలని పోస్ట్ చేసి తన 795K ఫాలోవర్స్ కి కిక్ ఇస్తూనే ఉంటుంది. అలాంటి ఫోటోనే లేటెస్ట్ గా సోనాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్, ఫోర్ గ్రౌండ్ సోనాల్ చౌహాన్ అందాలు ఉన్న ఈ ఫోటోకి ‘పూల్ లోకి దూకాలా వద్దా అని ఆలోచిస్తున్నా’ అంటూ కొటేషన్ ని పెట్టి సోనాల్ పోస్ట్ చేసింది. ఎల్లో క్యాప్, ఎల్లో నెయిల్స్, నెట్టేడ్ ప్యాంట్, పింక్ టాప్ తో సోనాల్ చోహాన్ ఎద అందాలని చూపిస్తూ తల ఒంచుకోని కూర్చుంది. అంతే సోనాల్ ని అలా చూడగానే, ఆమె కామెంట్ చదివిన ప్రతి ఒక్కరూ “ఆగు, నేను కూడా వస్తాను. కలిసి పూల్ లో దూకుదాం” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇప్పటికే సోనాల్ చౌహాన్ పోస్ట్ చేసిన ఫోటోకి 7500 లైకులు వచ్చాయి అంటే సోనాల్ అకౌంట్ ఎంత ఎంగేజింగ్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే సోనాల్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సోనాల్ చౌహాన్ ప్లే చేసేది సూర్ఫనక క్యారెక్టర్. రావణుడి చెల్లి పాత్రలో కనిపించనున్న సోనాల్ చౌహాన్ ‘ఆదిపురుష్’ సినిమాపై చాలా హాప్ పెట్టుకుంది. ఈ మూవీ తప్ప అమ్మడి చేతిలో మరో సినిమా లేదు, ఆదిపురుష్ ఆడితే సోనాల్ చౌహాన్ కెరీర్ బాగుంటుంది లేదంటే ఈ గ్లామర్ క్వీన్ కి కష్టాలు మొదలయినట్లే.
Thinking if I should jump in ….. 🏊♀️ #love #SonalChauhan #pool pic.twitter.com/hROAVEfmBw
— SONAL CHAUHAN (@sonalchauhan7) April 9, 2023